So daily
ATP News
*💥విజయవాడ ప్రయాణికులకు శుభవార్త*
*ఇకపై రోజూ ఎక్స్ప్రెస్ రైలు*
అనంతపురం(రైల్వే), న్యూస్టుడే: విజయవాడ వెళ్లే రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ ఊరట కల్పించింది. ధర్మవరం- విజయవాడ మధ్య నడిచే 17215/16 రైలును ఇకపై రోజూ నడపనున్నారు. ఈ రైలు ప్రస్తుతం వారంలో...
more... మూడు రోజులు నడుస్తోంది. రైల్వే బోర్డు ఆదేశాల మేరకు రోజూ నడిచే రైలుగా ఫ్రీక్వెన్సీని పెంచారు. ఈనెల 22వ తేదీ నుంచి ఇకపై రోజూ నడుస్తుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటన విడుదల చేశారు. 13 బోగీలతో ధర్మవరం నుంచి విజయవాడ, విజయవాడ నుంచి ధర్మవరానికి రోజు నడుపుతారు. జిల్లా కేంద్రం నుంచి విజయవాడకు రోజూ నడిచే రైలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజూ నడిచే రైలు బెంగళూరుసిటీ- భువనేశ్వర్(18464/63) ఒకటి మాత్రమే ఉండటంతో ప్రయాణికులకు టిక్కెట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ తత్కాల్ టిక్కెట్లు తీసుకోవాలన్నా దళారుల బెడద. ఈనేపథ్యంలో అమరావతి ఎక్స్ప్రెస్ను రోజూ నడపాలని నిర్ణయం తీసుకోవడంతో ప్రయాణికుల్లో సంతోషం నెలకొంది. అమరావతి ఎక్స్ప్రెస్ అనంతపురం నుంచి గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కోవెలకుంట్ల, బనగానపల్లి, నంద్యాల మీదుగా విజయవాడకు వెళుతుంది. కడప జిల్లా వాసులు విజయవాడకు వెళ్లడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ (17216) రైలు రోజూ సాయంత్రం 4 గంటలకు ధర్మవరంలో బయలుదేరుతుంది. అనంతపురానికి 4.25 గంటలకు చేరుకుని గుంటూరుకు మరుసటి రోజు తెల్లవారుజామున 5.35 గంటలు, విజయవాడకు 6.50 గంటలకు వెళుతుంది. తిరుగు ప్రయాణంలో 17215 విజయవాడలో రాత్రి 11 గంటలకు బయలుదేరి గుంటూరు 11.50 గంటలకు, నంద్యాలకు మరుసటి రోజు తెల్లవారుజామున 5.20 గంటలకు, అనంతపురానికి ఉదయం 11.33 గంటలకు చేరుకుంటుంది.